Saturday, May 2, 2009

నా సినిమాకి దర్శకుడు మార బోతున్నాడు

ఇదేదో నిజమైన సినిమా కాదు.
మొదటగా,
నేను సినిమా పిచ్చోడని మా వాళ్ళు అంటున్నారు ...కాని నాకంత పిచ్చి లేదని నేననుకుంటున్నాను...
ఈ పిచ్చి నాకు ఇంగ్లీష్ సినిమాలు (బిట్లు లేనివి) ఎక్కువగా చూడటం వలన వచ్చినదనుకుంటారు కొంత మంది …
కొంత మంది వీడు పుట్టటమే సినిమా హల్లో పుట్టాడు అందువలన పిచ్చి అని అనుకుంటారు …. దాంట్లో ఏది నిజమో వాళ్ళకే తెలియాలి … నాకు తెలిసినంత వరుకు సినిమాలు చాలా మంది చూస్తారు,అది కొంచం తక్కువ ,కొంచం ఎక్కువ ..మనిషిని బట్టి మారుతూ వుంటుంది…అలా చూసే వాళ్ళందరూ పిచ్చోల్లే ఐతే నేను పిచోడ్నే…
ఇక పోతే(నేను కాదులెండి)….నాకు తెలియని ప్రపంచం ఒకటుంది.నాకు ఈ మద్యనే తెలిసింది ..ఎవరికీ వారే ఇక్కడ స్వైరవిహారం చేస్తున్నారు …నేను ఇంతకాలం ఎంత కోల్పోయానా అనిపిస్తుంది .
పంది కేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అన్నట్లు …తేనె రుచి చూసిన వాడికే దాని మాదుర్యం తెస్లినట్టు..ఈ బ్లాగ్ ప్రపంచంలో మునిగి తేలినవాడికే వాటిలో మాదుర్యం తెలుసు…
నేను కవి(కనపడే వినపడే)ని కాదు బాగా చెప్పటానికి … రచయితను అంత కన్నా కాదు ..మీ హృదయాన్ని దొంగిలించటానికి …నా ఆలోచనని …నాలో రగిలే ఈ అగ్నిని … ఈ పోస్ట్ ద్వార
చల్లార్చుకున్దామనుకున్తున్నాను.
నా జీవితమే ఒక సినిమా … నా జీవితం అనే సినిమా కథ నేనే రాసుకోవాలి ..నా సినిమాని నేనే దర్సకత్వం వహించాలి …నా సినిమాలో ప్రతినాయకుడు ఉండ కూడదు..అనుకున్నాను ..
కాని నా కథలో చాలా మంది ప్రతి నాయకులు వున్నారు …నాకు బలపం పెట్టకుండా తిన్నవాడు ,నా మీద మ్యాడం కి చాడీలు చెప్పిన వాడు,నా 5 వ తరగతి లో నా మొదటి అఫ్ఫెక్షన్ లేడీని పెళ్లి చేసుకున్నవాడు ,నా లవర్ని ప్రేమించినవాడు …ఇలాగ....
నా కథలో చాలా మంది హీరోయిన్స్ వున్నారు (నేను అనుకోవటం ,నేను ఎప్పుడు వెళ్లి నా ప్రేమ చెప్పలేదు ..ఎవ్వరకి చెప్పవద్దు.. ఒన్ సైడ్ లవ్)…
కాని ప్రొడ్యూసర్ మాత్రమూ మా నాన్న నేను మాత్రమే …కనీసం నా పెళ్లి అయిన తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ యాడ్ ఐతే బాగుండు(నా మావ )
ఎన్తమంది హీరోయిన్స్ నా లైఫ్ లో …మొదటి హీరోఇన్ నా 5వ తరగతిలో ఎంటర్ అయ్యింది …ఆమెని చూడగానే …నాలో ఏదో తెలియని గుబులు,జలుబు..ఇంకా ఏదో ..
నేను
ధూమపానం,
మద్యపానం,
పేకాట,
జూదం,
స్త్రీవ్యసనం ...ఇలా పంచ వ్యసనాలకు దూరంగా వుందామనుకున్నాను.
ఆమె నా మనసునుదొంగిలించింది..అక్కడ నుండి దొంగతనం జరుగుతూనే వుంది …. అమ్మాయిలు అందమైన దొంగలు …
10వ తరగతి లో ఒక అమ్మాయి …+2 లో ఇంకో అమ్మాయి …లాంగ్ టర్మ్ లో ఇంకో అమ్మాయి ..ఇంజనీరింగ్ లో ఇంకో అమ్మాయి ..జాబు చేసేటప్పుడు ఇంకో అమ్మాయి …ఇలా లిస్టు …వీళ్ళతో పాటు సినిమా హీరోయిన్స్ ఎంత మంది మన జీవితం లో హీరోయిన్స్ …చాన్తడన్తవుంది…
నాకు యుక్త వయసు రాగానే ..నా ఫ్రెండ్స్ నీలి విప్లమంటే నీలి సినిమాలు బాగా చూడటం అన్నారు …అదే నిజం అనుకున్నాము(తర్వాత గాని తెలిసింది నీలి విప్లమంటే చేపలు,రొయ్యల్ని పెంచటం అని) …
నేను అందరి హీరో లాగానే …..హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమిస్తాను …ఎవర్ని తక్కువగా ప్రేమించను .
నాకు ఎప్పుడు ఒక ప్రశ్న నా మదిలో తడుతుంటుంది …నేను నాలాగే చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలని ప్రేమిస్తారు ..ఎప్పటివరకు అంటే ఇంకో మంచి అమ్మాయి కనపడే వరకు పిచ్చిగా ప్రేమిస్తారు …
ఐతే బాగున్న అమ్మయిలు ఒక్కల్నే ప్రేమిస్తే మిగతా అబ్బాయిలత ఏమి కావాలి …దేన్ని నేను కండిస్తున్నాను..
ఇక నా సినిమాలో కి వస్తే
హీరో :నేనే
ప్రతినాయకులు :నాతో పాటు కొంత మంది వున్నారు
ప్రొడ్యూసర్ : మానాన్న (నాకు జాబు వచ్చేదాకా)
ఫైనాన్సియర్స్:మా మావ (నా పెళ్లి తరవాత )
స్టొరీ ,స్క్రీన్ ప్లే,డైరక్షన్ :నేను (నాకు పెళ్లి అయ్యేదాకా ) నా ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కడి జీవితం వాడి చేతుల్లోనే వుంది … కొద్ది మంది మాత్రమే వాడి మనసు తోచినట్టు కాకుండా వేరే వాళ్ళు చెప్పిఅనట్టు చేస్తారు.
నా సినిమాకి విశ్రాంతి …నా మ్యారేజ్ …నా సినిమాకి దర్శకుడు మార బోతున్నాడు
ఇక్కడి నుంచి ఇంకో డైరెక్టర్ (వైఫ్) ఎంటర్ అవబోతుంది .. ఇంకా ఆమె నా సినిమా లో, నా కథలో ..నా డైరక్షన్లో ఎంటర్ అవబోతుంది …
ఇప్పటిదాకా సైలెంట్ గ వున్నా సినిమా ఇక వైలెంట్ కాబోతుంది… ప్రతి సినిమాలో క్లైమాక్స్ లో అసలు విలన్ ఎవరో తెలిస్తుంది … ఇప్పుడు చాలామంది జీవతం లో వాళ్ళ పిల్లలే ప్రతినాయకులు అవుతారు ..యాంటి క్లైమాక్స్ ..హీరో చాలా బాధల్లో చనిపోతాడు (పిల్లలు సరిగా చూడక) మరి ..నా సినిమాలో నేను నా కథ మార్చుకున్దమనుకుంటున్నాను ..నా సినిమాలో ప్రతినాయకులు లేకుండా చేసుకుందమనుకుంటున్నాను …నా పెళ్లి అయిన తరువాత విశ్రాంతి తరువత నా కథ నేనే నడుపు కున్దమనుకుంటున్నాను ..చూద్దాం నా కథలో ఎన్ని మలుపులు వున్నాయో …కథ ముగింపు కాలమే నిర్ణఇస్తుంది..
ప్రేమతో,
మెరిసే కళ్ళు

4 comments:

  1. pancha vyasanalu kaadu....they are sapta vyasanalu....you need to include two more

    ReplyDelete
  2. నా పెళ్లి అయిన తరువాత విశ్రాంతి తరువత నా కథ నేనే నడుపు కున్దమనుకుంటున్నాను
    idi ela nadupudam anukunnaro adi kuda cheppandi..., master !!!

    ReplyDelete
  3. mama...aripichavu po..(nuvvu pomakule)...!!
    ilage rechipoo !!

    director garu naku oka chinna doubt .. pelli ayyaka kuda mee kallu merustu vuntayo ledhu choodalani vundhi...!! (very excited..)

    ReplyDelete